నాలుక కరుచుకొని.. డిలీట్‌ చేయక్కర్లేదు

అయితే ట్వీటు సెండ్‌ అయ్యేలోపు... క్యాన్సిల్‌ చేసుకునే ఆప్షన్‌ ఇస్తారట

Published : 06 Mar 2021 12:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్వీట్‌ చేయడం అంటే.. పెన్నుతో రాయడం లాంటిదే. పెన్నుతో రాసింది ఎలా మార్చడం వీలుపడదో..  ట్వీటును ఎడిట్‌ చేయడం కూడా అస్సలు కుదరదు. కావాలంటే ఆ ట్వీటును డిలీట్‌ చేసి మళ్లీ కొత్తగా ట్వీటాల్సిందే. దీంతో చాలా రోజుల నుంచి ట్వీట్లను ఎడిట్‌ చేసుకునే సౌలభ్యం ఇవ్వాలంటూ నెటిజన్లు అడుగుతున్నా... ఆ దిశగా ట్విటర్‌ పెద్దలు ఆలోచించడం లేదు. దీంతో ట్వీటులో తప్పులు వస్తే.. నాలుక కరుచుకొని డిలీట్‌ చేయడం తప్ప వేరే ఆప్షన్‌ లేకుండా పోయింది. అయితే ట్వీటు సెండ్‌ అయ్యేలోపు... క్యాన్సిల్‌ చేసుకునే ఆప్షన్‌ ఇస్తారట. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు వచ్చిందని సమాచారం.

ట్వీటు మొత్తం రాసి.. పైన ట్వీట్‌ బటన్‌ క్లిక్‌ చేశాక... ‘అన్‌ డు’ అని ఓ ఆప్షన్‌ కనిపిస్తుంది. ట్వీటు చేసిన ఐదు సెకన్ల వరకు ‘అన్‌ డు’ ఆప్షన్‌ ఉంటుంది. ఈలోపు దాన్ని క్లిక్‌ చేస్తే.. ట్వీట్‌ పోస్ట్‌ అవ్వదు. ఈ ఆప్షన్‌ ప్రయోగాత్మకంగా కొంతమందికి అందుబాటులోకి వచ్చిందని తెలుస్తోంది. త్వరలో మిగిలిన యూజర్లకు అందిస్తారు. దీంతో ట్వీట్‌లో అక్షర దోషాలకు చాలా వరకు చెక్‌ పడే అవకాశం ఉంది. అలాగే, ఇటీవల ఐఓఎస్‌ వినియోగదారుల కోసం ‘ఆడియో ట్వీట్‌ ’ స్టయిల్‌ ఫీచర్‌ ‘స్పేసెస్‌’ తీసుకొచ్చింది. ఆ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు వీలైనంత త్వరగా తీసుకొస్తారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని