వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ.. ఓకే చెప్పారా?

ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌ చేసింది. ఈ మేరకు వాట్సాప్‌ తన యూజర్లకు ఓ నోటిఫికేషన్‌ పంపిస్తోంది. వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసిన పాలసీనికి అంగీకరించాలన్నది.

Published : 06 Jan 2021 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌కు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తన టర్మ్స్‌ అండ్‌ ప్రైవసీ పాలసీని తాజాగా అప్‌డేట్‌ చేసింది. ఈ మేరకు వాట్సాప్‌ తన యూజర్లకు ఓ నోటిఫికేషన్‌ పంపిస్తోంది. చాలామంది నిన్న సాయంత్రం నుంచి వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే ఈ నోటిఫికేషన్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తోంది. వాట్సాప్‌ అప్‌డేట్‌ చేసిన పాలసీకి అంగీకరించాలన్నది దాని సారాంశం. కొత్త ప్రైవసీ పాలసీ ప్రకారం ఫేస్‌బుక్‌ సంబంధిత సర్వీసులతో యూజర్‌ డేటా పంచుకోవడమమనేది ముఖ్యమైన అంశం. యూజర్‌ వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ తదితర వివరాలు ఫేస్‌బుక్‌తో వాట్సాప్‌ పంచుకుంటుంది.

ఫిబ్రవరి 8 నుంచి ఈ కొత్త ప్రైవసీ పాలసీ అమల్లోకి రానుంది. అప్పటిలోగా కొత్త పాలసీకి యూజర్‌ ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రైవసీ పాలసీని విస్మరించడానికి వీల్లేదు. ఎందుకంటే పాలసీని యూజర్‌ ఆమోదించకుంటే ఇకపై వాట్సాప్‌ను వినియోగించలేరు. ఇప్పటికే ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు వాట్సాప్‌ దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు పంపిస్తోంది. దిగువ చిత్రంలో చూపిన విధంగా మీ వాట్సాప్‌ తెరపై వచ్చిన సందేశానికి మీరు ‘అగ్రీ’ బటన్‌ను క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. డేటా వినియోగంపై చర్చ జరుగుతున్న వేళ వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీని అప్‌డేట్‌ చేయడం గమనార్హం.

ఇవీ చదవండి..
గూగుల్ కొత్త పాలసీ..ఏం చేయాలో తెలుసా?
తక్కువ ధరకే 5జీ ఫోన్‌.. ఎప్పుడంటే..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని