డెల్టా ప్లస్‌లో మూడు ఉప రకాలు

డెల్టా ప్లస్‌ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటం.. మహారాష్ట్రలో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.  డెల్టాప్లస్‌తో తొలి మరణం ఇటీవల సంభవించింది.

Published : 15 Aug 2021 04:27 IST

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఏవై. 3 కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: డెల్టా ప్లస్‌ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటం.. మహారాష్ట్రలో ఒకరు మృతి చెందడంతో రాష్ట్రంలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.  డెల్టాప్లస్‌తో తొలి మరణం ఇటీవల సంభవించింది. ముంబయిలో టీకా రెండు డోసులు వేసుకున్న 63 ఏళ్ల మహిళకు కొవిడ్‌ సోకి మరణించడం.. జన్యుక్రమ పరీక్షల్లో డెల్టాప్లస్‌ వైరస్‌ అని తేలడంతో అప్రమత్తం కావాల్సిన పరిస్థితి. ఏప్రిల్‌ నుంచి వివిధ రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ కేసులు బయటపడుతున్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 65 కేసులున్నాయి. ఆంధ్రా, తెలంగాణల్లో గతంలోనే రెండేసి కేసులు నమోదయ్యాయి. మ్యుటేషన్లతో డెల్టాప్లస్‌లోనూ మరో మూడు ఉప రకాల వైరస్‌లు పుట్టుకొచ్చాయి. వీటిని ఏవై.1, ఏవై.2, ఏవై.3 పేర్లతో గుర్తించగా, ఏవై.3 రకం భయపెడుతోంది. వీటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 17 వేలకు పైగా నమోదయ్యాయని, క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌లోనూ 261 వరకు కేసులున్నాయని సీసీఎంబీ మాజీ సంచాలకులు డాక్టర్‌ రాకేశ్‌మిశ్ర తెలిపారు.

కొత్త వైరస్‌ రకాల తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే జన్యుక్రమ విశ్లేషణ పక్కాగా నిర్వహించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుతం జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నమూనాలు ఒక రాష్ట్రంలో ఎక్కువగా, మరో రాష్ట్రంలో అత్యల్పంగా ఉంటున్నాయి. నమూనాలు చేరడం, పరీక్షించడం, గ్లోబల్‌ డేటాకు పంపించడం వరకు ఆలస్యం అవుతుండటంతో వైరస్‌ ఉంటే వ్యాప్తి పెరుగుతోంది. జూన్‌లో అత్యధిక సంఖ్యలో జన్యుక్రమాలను ఆవిష్కరించినా, జులై నుంచి కేసులు తగ్గడంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ తగ్గిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని