‘ఆర్టీసీ డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి’

విమానాలకు వినియోగించే ఇంధనంపై మాదిరిగానే ఆర్టీసీ ఉపయోగించే డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు.

Published : 24 May 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: విమానాలకు వినియోగించే ఇంధనంపై మాదిరిగానే ఆర్టీసీ ఉపయోగించే డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలో డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. విమానాలకు వినియోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాతమే వ్యాట్‌  వసూలు చేస్తుంది. డీజిల్‌పై మాత్రం 27 శాతం వసూలు చేస్తుండడంతో ప్రభుత్వ రంగ రవాణా సంస్థ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని