26న ఐఎస్‌బీ వార్షికోత్సవం

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం, స్నాతకోత్సవాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. సోమవారం ఐఎస్‌బీ డీన్‌ మదన్‌

Published : 24 May 2022 05:51 IST

  ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ

సంస్థ డీన్‌ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌- రాయదుర్గం, న్యూస్‌టుడే: ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం, స్నాతకోత్సవాన్ని ఈ నెల 26న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. సోమవారం ఐఎస్‌బీ డీన్‌ మదన్‌ పిల్లుట్ల విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ‘‘తొలిసారి హైదరాబాద్‌, మొహాలీ క్యాంపస్‌లకు ఉమ్మడి స్నాతకోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐఎస్‌బీలో ప్రధాని పర్యటన దాదాపు గంటపాటు ఉంటుంది. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడంతోపాటు, ఈ ఏడాది పీజీపీఎం (పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌)లో ప్రతిభ చాటిన 10 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందిస్తారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ఉన్నతాధికారులు హాజరవుతారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. వేరే రాష్ట్ర పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆరోజు ఐఎస్‌బీకి రావడం లేదని సమాచారం ఇచ్చారు’’ అని డీన్‌ వెల్లడించారు.

ప్రపంచస్థాయిలో ఐఎస్‌బీకి 38వ ర్యాంకు

ప్రపంచస్థాయిలో ఐఎస్‌బీ అందిస్తోన్న ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌కు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఈ ఏడాది 38వ స్థానం దక్కినట్లు డిప్యూటీ డీన్‌ దీపామణి తెలిపారు. మన దేశానికి సంబంధించి మొదటి ర్యాంకు వచ్చినట్లు వెల్లడించారు. 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులకు మిడ్‌ కెరీర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌లో వారం రోజుల శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది డిసెంబరు 16న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకూ 300 మంది ఉన్నతాధికారులకు శిక్షణ ఇచ్చినట్లు దీపామణి వెల్లడించారు.

బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఐఎస్‌బీలో బందోబస్తు ఏర్పాట్లను నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, పలువురు అధికారులు సోమవారం ఎస్‌పీజీ సిబ్బందితో కలిసి పరిశీలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని