టెట్‌ వాయిదా కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ ఆందోళన

టెట్‌ వాయిదా వేయాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు....

Published : 29 May 2022 05:16 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: టెట్‌ వాయిదా వేయాలని కోరుతూ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వినతిపత్రం ఇచ్చేందుకు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలోని మంత్రి సబిత ఇంటి వద్దకు చేరుకున్నారు. నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వెంకట్‌తోపాటు ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కార్యకర్తలు మంత్రి నివాసానికి సమీపంలో బైఠాయించి నినాదాలు చేశారు. పోలీసులు వారిని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అనంతరం బల్మూరి వెంకట్‌ మాట్లాడుతూ.. ఒకే రోజున (జూన్‌ 12) టెట్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్షలను నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఉన్న టెట్‌ను వాయిదా వేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని