Guinness Record: ‘ఎలుకల బోను’ తయారీలో జగిత్యాల వాసి గిన్నిస్‌ రికార్డు

జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌కు గిన్నిస్‌ బుక్‌లో చోటుదక్కింది. అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను....

Published : 29 May 2022 08:03 IST

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే: జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్‌కు గిన్నిస్‌ బుక్‌లో చోటుదక్కింది. అతి చిన్నసైజులో ఎలుకల బోను నమూనాను సృష్టించిన దయాకర్‌ కృషిని గిన్నిస్‌ సంస్థ గుర్తించింది. 5 మిల్లీమీటర్ల పొడవు, 2.5 మిల్లీమీటర్ల వెడల్పుతో 29 నిమిషాల్లోనే ఈ బోనును రూపొందించడం విశేషం. అయిదేళ్ల క్రితం ఓ భారతీయుడు గంటలో సూక్ష్మ బోనును తయారుచేయగా.. దయాకర్‌ ఆ రికార్డును అధిగమించారు. గత డిసెంబరు 2న అధికారుల సమక్షంలో నిబంధనల మేరకు బోనును తయారు చేసి పంపగా.. తాజాగా గిన్నిస్‌ రికార్డు వరించిందని దయాకర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు