Jagtial: కార్మికుల కష్టం చూసి మున్సిపల్‌ కమిషనర్‌ కంటతడి

ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. జగిత్యాల 20వ వార్డులోని ప్రధాన కాల్వలో ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా మురుగు పేరుకుపోవడంతో శనివారం పారిశుద్ధ్య సిబ్బంది తొలగింపు చేపట్టారు.

Updated : 12 Jun 2022 09:57 IST

ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. జగిత్యాల 20వ వార్డులోని ప్రధాన కాల్వలో ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా మురుగు పేరుకుపోవడంతో శనివారం పారిశుద్ధ్య సిబ్బంది తొలగింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు కాల్వలో జారి పడబోగా తోటి కార్మికులు రక్షణగా నిలిచారు. ఈ పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి కార్మికులు పడుతున్న ఇబ్బందులను చూసి తీవ్ర ఆవేదనకు గురై కంట తడిపెట్టారు. పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదని, ప్లాస్టిక్‌ మూలంగానే కార్మికులు ఇలా కష్టపడాల్సి వస్తోందని ఆమె తెలిపారు.

- న్యూస్‌టుడే, జగిత్యాల పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు