విదేశీ విద్యకు చేయూత

ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని పేద, దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు మంచి అవకాశం. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ‘సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం’ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది.

Published : 03 Jul 2022 06:19 IST

ఎస్సీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని పేద, దిగువ, మధ్య తరగతి విద్యార్థులకు మంచి అవకాశం. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ‘సీఎం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం’ ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్‌, కెనడా తదితర దేశాల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చదివేందుకు రూ.20 లక్షల వరకూ ఆర్థిక సాయం చేస్తుంది. విమాన ప్రయాణ ఛార్జీల కోసం అదనంగా రూ.60 వేలు ఇస్తుంది. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్న మైనార్టీ అభ్యర్థులు అర్హులు. 2022 జనవరి- జూన్‌ మధ్య విదేశీ వర్సిటీల్లో ప్రవేశం పొంది ఉండాలి. ఈనెల 31లోగా ‌www.telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తు వివరాల ప్రతిని ఆగస్టు 10లోగా నాంపల్లిలోని హజ్‌హౌస్‌ కార్యాలయంలో అందించాలని హైదరాబాద్‌ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మహమ్మద్‌ ఖాసిం తెలిపారు.

* విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ఎలాంటి గడువులేదని, ఎప్పుడైనా అర్జీ పెట్టుకోవచ్చని హైదరాబాద్‌ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి రామారావు వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు నాంపల్లిలోని కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని