విద్యుత్‌ రాయితీకి రూ.875 కోట్ల విడుదల

వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు తక్కువ ఛార్జీలకు సరఫరా చేస్తున్న కరెంటుకు సంబంధించి జులై నెలకు రాయితీ కింద రూ.875 కోట్లను విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర ఇంధనశాఖ విడుదల చేసింది.

Published : 03 Jul 2022 06:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు తక్కువ ఛార్జీలకు సరఫరా చేస్తున్న కరెంటుకు సంబంధించి జులై నెలకు రాయితీ కింద రూ.875 కోట్లను విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రాష్ట్ర ఇంధనశాఖ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రతి నెలా ఈ నిధులు విడుదల చేయడం ఆనవాయితీ. బయోమాస్‌ ఇంధన అభివృద్ధి పథకం కింద ప్రోత్సాహకంగా రూ.29.54 కోట్లను 5 ఇంధన కంపెనీలకు విడుదల చేస్తూ మరో ఉత్తర్వు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఇంధన బాండ్లపై వాయిదాల చెల్లింపు  కోసం రూ.598.10 కోట్లను విడుదల చేస్తూ ఇంకో ఉత్తర్వును ఇంధనశాఖ జారీచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని