మానవ అక్రమ రవాణాను సంయుక్తంగా అడ్డుకుందాం

అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు నిర్ణయించారు.

Published : 03 Jul 2022 06:19 IST

ఆరు రాష్ట్రాల ప్రతినిధుల నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కలిసికట్టుగా పనిచేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు నిర్ణయించారు. నిఘా వర్గాల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, సాక్షులకు రక్షణ, బాధితులకు పునరావాసం కల్పించేందుకు కృషి చేయాలని తీర్మానించారు. ‘మానవ అక్రమ రవాణాపై పోరు’ అంశంపై హైదరాబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో ప్రజ్వల, శక్తివాహిని స్వచ్ఛంద సంస్థల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్ర, శనివారాల్లో రెండ్రోజుల సదస్సు నిర్వహించింది. ఆయా రాష్ట్రాల హోం, స్త్రీ, శిశు, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు.. మహిళా కమిషన్‌, బాలల కమిషన్‌, న్యాయ సేవాధికార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అక్రమ రవాణాపై స్వచ్ఛంద సంస్థలు నిరంతర నిఘా ఉంచాలని.. రాష్ట్రాల మధ్య సహకారం మరింత అవసరమని ప్రజ్వల, శక్తివాహిని సంస్థల ప్రతినిధులు సునీత కృష్ణన్‌, రిషికాంత్‌ సూచించారు. సదస్సులో తెలంగాణ, ఏపీ మహిళా కమిషన్ల ఛైర్‌పర్సన్లు సునీత లక్ష్మారెడ్డి, వాసిరెడ్డి పద్మ, అమెరికా రాయబార కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి డేవిడ్‌ మోయర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని