వనపర్తి, సంగారెడ్డి వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

రాష్ట్రంలోని సంగారెడ్డి, వనపర్తి వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి లభించింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఒక్కో వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్‌

Published : 12 Aug 2022 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంగారెడ్డి, వనపర్తి వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) అనుమతి లభించింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఒక్కో వైద్య కళాశాలలో 150 ఎంబీబీఎస్‌ సీట్ల చొప్పున తరగతులు నిర్వహించేందుకు అంగీకరిస్తూ ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌కు లేఖ రాసింది. దీంతో ఈ ఏడాది తెలంగాణలోని నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి లభించినట్లయింది. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌, జగిత్యాల వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ ఆమోదం లభించగా.. గురువారం మరో రెండు కళాశాలలకు అనుమతులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని