ప్రత్యేక రాష్ట్రంలోనే ఆలయాల అభివృద్ధి: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకే ఆలయాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Updated : 02 Oct 2022 05:35 IST

పాపన్నపేట, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకే ఆలయాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన బోనాల్లో ఎమ్మెల్సీ కవిత, మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. తొలుత స్థానిక గోకుల్‌షెడ్‌లో ప్రతిష్ఠించిన అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు చేశారు. అనంతరం కవిత, పద్మాదేవేందర్‌రెడ్డిలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. గర్భగుడిలో వనదుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ప్రతి ఏటా ప్రభుత్వం ఏడుపాయల్లో జాతరను వైభవంగా నిర్వహిస్తోందన్నారు. తన వంతుగా కాటేజీ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని