సరకుల చేరవేత.. ఇక తేలిక

ఉత్పత్తయిన చోటు నుంచి సరకులను నేరుగా గమ్యస్థానం చేర్చేవరకూ తనదే బాధ్యత అంటూ తపాలాశాఖ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది.

Published : 25 Nov 2022 09:35 IST

 తపాలాశాఖ సరికొత్త సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉత్పత్తయిన చోటు నుంచి సరకులను నేరుగా గమ్యస్థానం చేర్చేవరకూ తనదే బాధ్యత అంటూ తపాలాశాఖ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు రైల్వే మద్దతు తీసుకుంటోంది. ‘రైల్‌ పోస్ట్‌ గతిశక్తి- జాయింట్‌ పార్సిల్‌ ప్రొడక్ట్‌(జేపీపీ) పేరిట ఈ సేవలను ప్రారంభించింది. ఉత్పత్తిదారులు తాము పంపించిన వస్తువులు ఎక్కడున్నాయి, ఎప్పటిలోగా నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటాయనే వివరాలు ఆన్‌లైన్లో ట్రాక్‌ చేయడానికి ఒక బార్‌కోడ్‌నూ అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు లభిస్తాయని, ప్రతి జిల్లాలో కొన్ని తపాలా కార్యాలయాలను సేకరణ కేంద్రాలుగా ఎంపిక చేశామని తపాలాశాఖ హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పీవీఎస్‌ రెడ్డి తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఉత్పత్తులను చేరవేసేందుకు అనువైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. ఎండు మిరప, వేరుసెనగ, రాగులు, మామిడిపండ్లు.. ఇలా ఉత్పత్తులన్నింటినీ భద్రంగా చేరవేయడమే కాకుండా.. వాటికి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని