గౌరవెల్లి వద్ద సీసీ కెమెరాలు పనిచేయడం లేదు

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల శాఖ కరీంనగర్‌ ఈఎన్సీకి గోదావరి బోర్డు మెంబర్‌ సెక్రటరీ అజిగేషన్‌ తాజాగా లేఖ రాశారు.

Published : 09 May 2024 03:49 IST

నీటిపారుదల శాఖ కరీంనగర్‌ ఈఎన్సీకి గోదావరి బోర్డు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని వెంటనే తగిన చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల శాఖ కరీంనగర్‌ ఈఎన్సీకి గోదావరి బోర్డు మెంబర్‌ సెక్రటరీ అజిగేషన్‌ తాజాగా లేఖ రాశారు. ‘జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) ఆదేశాల ప్రకారం పర్యావరణ అనుమతులు వచ్చే వరకు గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేపట్టకుండా చూడాల్సి ఉంది. దీనికోసం ప్రాజెక్టు వద్ద పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదు. ఈ విషయాన్ని బోర్డు సంబంధిత అధికారులకు ఇప్పటికే పలుమార్లు తెలియజేసింది. ఈ ఏడాది జులై 4న ఎన్జీటీ వద్ద తుది విచారణ జరగనుంది. ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు ఏర్పాటైన సీసీ కెమెరాల నిర్వహణ లోపాన్ని ఎన్జీటీ తీవ్రంగా పరిగణించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా హైదరాబాద్‌లోని జీఆర్‌ఎంబీ కార్యాలయానికి డేటా చేరేలా సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని