దేవాదాయ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోండి

దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు.

Published : 09 May 2024 03:48 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎండోమెంట్‌ కమిషనర్‌, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హనుమంతరావు, అదనపు, సంయుక్త, సహాయ కమిషనర్లు, పలు ప్రధాన దేవాలయాల కార్యనిర్వాహక అధికారులు పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న దేవాలయాల భూముల వివరాలను సేకరించి, ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు