నేడు.. రేపు ఓ మోస్తరు వర్షాలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ బుధవారం పేర్కొంది.

Published : 09 May 2024 03:43 IST

 తగ్గుముఖం పట్టిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ బుధవారం పేర్కొంది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు మంగళవారం ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఈ నెల 12 వరకు పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, జల్లులు కురవనున్నాయి. 12న కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు(ఆరెంజ్‌) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది. బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అత్యధికంగా నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జకోరా, నిజామాబాద్‌ అర్బన్‌లో 42.9 డిగ్రీలు నమోదైంది.

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు

దోమకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిక్కనూరులో 3.2 సెంటీ మీటర్లు కురిసింది. కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈదురుగాలులకు ఇళ్ల రేకులు ఎగిరొచ్చిపడటంతో ముగ్గురికి తీవ్రగాయాలవ్వడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని