పోలీసుశాఖ ప్రగతి పద్దు రూ.474.85 కోట్లు
ప్రగతి పద్దు కింద పోలీసుశాఖకు బడ్జెట్‌లో రూ.474.85 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌్ (2022-23)లో రూ.1,104.85 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు తగ్గాయి.
ఈనాడు, హైదరాబాద్: ప్రగతి పద్దు కింద పోలీసుశాఖకు బడ్జెట్‌లో రూ.474.85 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌్ (2022-23)లో రూ.1,104.85 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు తగ్గాయి. ఇందుకు ప్రధాన కారణం.. పోలీసు భవనాలు, రిసెప్షన్ కేంద్రాలు వంటి మౌలిక వసతుల కల్పన దాదాపు పూర్తికావడంతో వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం తప్పింది. కొత్త పోలీస్‌స్టేషన్లు, క్వార్టర్ల నిర్మాణానికి నిధులను రూ.323 కోట్ల నుంచి రూ.100 కోట్లకు తగ్గించారు.
నిఘా విభాగానికి పెంపుదల.. శిక్షణకు ప్రాధాన్యం
నిఘా విభాగం బడ్జెట్‌ను రూ.67.95 కోట్ల నుంచి రూ.72.37 కోట్లకు పెంచారు. ప్రస్తుతం 17వేల పోలీసు ఉద్యోగాల నియామకాలు జరుగుతుండటంతో వారి శిక్షణను దృష్టిలో ఉంచుకొని అవసరమైన నిధులు పెంచారు. ఎస్పీ కార్యాలయాల భవనాల నిర్మాణానికి రూ.20.48 కోట్ల నుంచి రూ.35.84 కోట్లకు, ఎస్సైలకు శిక్షణ ఇచ్చే పోలీసు అకాడమీ బడ్జెట్‌ను రూ.2.48 కోట్ల నుంచి రూ.5.34 కోట్లకు, పోలీసు శిక్షణ కళాశాల బడ్జెట్ రూ.10 లక్షల నుంచి రూ.55 లక్షలకు, శిక్షణార్థులకు ఇచ్చే స్టైపెండ్ రూ.2.62 కోట్ల నుంచి రూ.3.07 కోట్లకు పెంచారు.
‘హోం’ నిర్వహణ పద్దు పెంపు
హోంశాఖ పరిధిలోకి వచ్చే పోలీసు, జైళ్లు, అగ్నిమాపకశాఖ వాటన్నింటికీ కలిపి నిర్వహణ పద్దు పెరిగింది. గత బడ్జెట్‌లో రూ.7,846.99 కోట్లు కేటాయించగా ఈసారి రూ.8,727.32 కోట్లకు పెంచారు.
అగ్నిమాపక శాఖకు రెట్టింపు..
గత బడ్జెట్‌లో ఫైర్‌ఇంజిన్లు వంటివాటి కొనుగోలుకు రూ.2 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తం రూ.12.43 కోట్లకు (6 రెట్లు) పెంచారు. మొత్తంగా అగ్నిమాపక శాఖకు ప్రగతి పద్దు కింద గత ఏడాది రూ.16.12 కోట్లు కేటాయించగా ఈసారి ఆ మొత్తాన్ని రూ.32.12 కోట్లకు పెంచారు. ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పరికరాల కొనుగోలుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?