‘సెర్ప్‌’ ఉద్యోగులకు ఉగాది కానుక

గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వేతన విధానం (పే స్కేల్‌) అమలుకు శనివారం ఉత్తర్వులు (జీవో నం.11) జారీ చేసింది.

Updated : 19 Mar 2023 04:42 IST

1 నుంచి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. వారికి ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వేతన విధానం (పే స్కేల్‌) అమలుకు శనివారం ఉత్తర్వులు (జీవో నం.11) జారీ చేసింది. 23 సంవత్సరాలుగా సెర్ప్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కొత్త పే స్కేల్‌ ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో 3,974 మందికి వేతనాలు పెరుగుతాయి. వారికి ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌లు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.58 కోట్ల భారం పడనుంది.

* ప్రస్తుతం 716 మంది పదో తరగతి అర్హతతో మండల సమాఖ్య కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లుగాను, మరో 21 మంది మండల, డివిజన్‌ ప్రతినిధులుగాను ఉన్నారు. వారికి రూ.19,000-58,850 స్కేలు వర్తిస్తుంది.

* ఇంటర్‌ అర్హతతో పనిచేస్తున్న 338 మంది మండల బుక్‌ కీపర్లకు రూ.22,240-67,300 స్కేలు..

* డిగ్రీ అర్హతతో కమ్యూనిటీ కోఆర్డినేటర్లుగా ఉన్న 1,719మందికి రూ.24,280-72,850 స్కేలు..

* పీజీ అర్హతతో సహాయ ప్రాజెక్టు మేనేజర్లుగా పనిచేస్తున్న 697 మందికి రూ.32,810-96,890 స్కేలు వర్తిస్తుంది. పీజీ అర్హతతోనే జిల్లా ప్రాజెక్టు మేనేజర్లుగా ఉన్న 160 మందికి రూ.42,300-1,15,270 స్కేలు..

* ప్రాజెక్టు మేనేజర్లుగా ఉన్న 37 మందికి రూ.51,320 - 1,27,310 వేతన స్కేలు..

* పదో తరగతి అర్హత గల 21 మంది డ్రైవర్లకు రూ.22,900-69,150; 110 మంది ఆఫీస్‌ సబార్డినేట్లకు రూ.19వేలు-58,850; డిగ్రీ అర్హతతో అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌/ప్రాజెక్టు కార్యదర్శులుగా ఉన్న 155 మందికి రూ.24,280-72,850 పే స్కేలు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని