ఉపాధి హామీకి కేంద్రం షాక్‌

వచ్చే ఆర్థిక (2023-24) సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో తెలంగాణలో పనిదినాలు భారీగా తగ్గనున్నాయి.

Published : 20 Mar 2023 03:36 IST

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 7 కోట్ల పనిదినాలే
ఈ ఏడాది కంటే మూడు కోట్లు తక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే ఆర్థిక (2023-24) సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో తెలంగాణలో పనిదినాలు భారీగా తగ్గనున్నాయి. ఈసారి 7 కోట్ల పనిదినాలను కల్పించాలని దిల్లీలో జరిగిన ఉపాధి హామీ సాధికారత కమిటీ సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్రానికి సమాచారం అందింది. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)తో పోలిస్తే మూడు కోట్ల పనిదినాలు తక్కువగా దక్కనున్నాయి. గత అయిదేళ్లలో ఇంత తక్కువగా  కేటాయింపు ఎప్పుడూ జరగలేదు. 2019-20లో 12 కోట్లు, 2020-21లో 13 కోట్లు, 2021-22లో 13 కోట్లు, 2022-23లో 10 కోట్ల పనిదినాలను కేంద్రం మంజూరు చేసింది.  వచ్చే ఆర్థిక సంవత్సరంలో  7 కోట్లకు తగ్గించింది. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి హామీకి నిధులను భారీగా తగ్గించడంతో ఈ ప్రభావం పనులపై పడుతుందని ముందే అంచనా వేశారు. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఉండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని