26న పీటీవో ఎస్సై పరీక్ష

పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌(పీటీవో)లో ఎస్సై ఉద్యోగాల ఎంపికకు సంబంధించి ఈనెల 26న రాత పరీక్ష (టెక్నికల్‌ పేపర్‌) నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 20 Mar 2023 05:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోలీసు ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌(పీటీవో)లో ఎస్సై ఉద్యోగాల ఎంపికకు సంబంధించి ఈనెల 26న రాత పరీక్ష (టెక్నికల్‌ పేపర్‌) నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ పరిసరాల్లోని కేంద్రాల్లో ఆ రోజు ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ పరీక్ష జరుగుతుందన్నారు. హాల్‌టికెట్లను ఈనెల 21 ఉదయం 8 నుంచి 24న అర్ధరాత్రి 12 గంటల వరకూ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. దానిపై అభ్యర్థులు తమ పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో అంటించాలని, లేనిపక్షంలో దాన్ని పరిగణనలోకి తీసుకోబోమన్నారు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాకుంటే support@tslprb.inకి ఈ-మెయిల్‌ చేయడం, లేదా 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించవచ్చన్నారు. ఇదే ఉద్యోగానికి సంబంధించి నిర్వహించబోయే తదుపరి రెండు పరీక్షలకు హాల్‌టికెట్లు వేర్వేరుగా జారీ చేస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని