ఓయూలో పీహెచ్‌డీ ఫీజులు భారీగా పెంపు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక (పీహెచ్‌డీ) విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఫీజును రూ.2,500 నుంచి రూ.25 వేలకు.. ఆర్ట్స్‌, లా కేటగిరీల్లో రూ.20 వేలకు పెంపుదల చేశారు.

Updated : 21 Mar 2023 10:45 IST

రూ.2,500 నుంచి రూ.25 వేలకు..

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధక (పీహెచ్‌డీ) విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఫీజును రూ.2,500 నుంచి రూ.25 వేలకు.. ఆర్ట్స్‌, లా కేటగిరీల్లో రూ.20 వేలకు పెంపుదల చేశారు. సంబంధిత రుసుములను ఒకేసారి భారీగా పెంచడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వర్సిటీలకు పోటీగా ఓయూ అధికారులు ఫీజులను పెంచారని పేర్కొన్నారు. పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాల నాయకులు రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. ఓయూ అధికారులు విద్యార్థి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను పరిశోధన రంగానికి దూరం చేసేందుకే రుసుములను భారీగా పెంచినట్లు ఆరోపించారు. కాగా సుమారు 15 ఏళ్ల తర్వాతే ఈ ఫీజులను పెంచినట్లు ఉప కులపతి ప్రొ.రవీందర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని