కేంద్ర ఉత్తర్వుల మేరకు ఓపీఎస్‌ను అమలు చేయండి

ఉమ్మడి రాష్ట్రంలో 2004 సంవత్సరానికి ముందు వచ్చిన ఉద్యోగ ప్రకటనల ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ పాత పింఛను విధానం(ఓపీఎస్‌) అమలు చేయాలని తెలంగాణ సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు డిమాండ్‌ చేశారు.

Published : 29 Mar 2023 04:49 IST

సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో 2004 సంవత్సరానికి ముందు వచ్చిన ఉద్యోగ ప్రకటనల ద్వారా నియమితులైన ఉద్యోగులందరికీ పాత పింఛను విధానం(ఓపీఎస్‌) అమలు చేయాలని తెలంగాణ సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావు డిమాండ్‌ చేశారు. ‘1999లో గ్రూపు-1, 2002, 2003లలో డీఎస్సీ, 2003లో కానిస్టేబుళ్ల నోటిఫికేషన్లు వచ్చాయి. వీటిలో వేల మంది 2004 కంటే ముందే ఎంపికైనా... 2004 సెప్టెంబరు 1 తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు. వారందరికీ కాంట్రిబ్యూటరీ పింఛను విధానం(సీపీఎస్‌) వర్తింపజేశారు. ఫలితంగా వారంతా తీవ్రంగా నష్టపోతున్నారు. సమస్యను పరిగణనలోనికి తీసుకొని కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబరు కంటే ముందే నియమితులైన వారిని ఓపీఎస్‌ కిందికి తెచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి’ అని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని