టోల్‌ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు

జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజలపై పెనుభారం పడుతుందని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు.

Published : 30 Mar 2023 05:56 IST

పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
కేంద్ర మంత్రి గడ్కరీకి మంత్రి ప్రశాంత్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల పెంపుతో తెలంగాణ ప్రజలపై పెనుభారం పడుతుందని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీకి రాష్ట్ర రహదారులు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘2014లో తెలంగాణ రాష్ట్రం నుంచి టోల్‌ ఛార్జీల రూపంలో రూ.600 కోట్లు వసూలు చేశారు. ఏటా ఆ ఛార్జీల పెంపుతో ప్రస్తుతం ఆ వసూళ్లు రూ.1824 కోట్లకు చేరాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఈ ఛార్జీల వసూలు 300 శాతం పెంచారు. తెలంగాణ నుంచి రూ.9 వేల కోట్లు వసూలు చేశారు. మరోవైపు గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి చేసిన ఖర్చు రూ.20,350 కోట్లు మాత్రమే. అంటే ఖర్చు చేసిన మొత్తంలో సుమారు సగం సొమ్మును టోల్‌ ఛార్జీల రూపంలో వసూలు చేసినట్లయింది. గత తొమ్మిది ఏళ్లలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడంతోపాటు రోడ్‌ సెస్సుల పేరిట కేంద్రం రూ.వేల కోట్లు వసూలు చేసింది. ఆ డబ్బంతా ఎటు పోతుందో ప్రజలకు లెక్క చెప్పాలి. మరోవైపు రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం కేంద్రం రూ.లక్షల కోట్లు ఖర్చు చేసిందంటూ భాజపా నాయకులు పదేపదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు’ అని లేఖలో ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని