Warangal: డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌కు బెయిల్‌

రాష్ట్రంలో సంచలనం కలిగించిన డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌కు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరైంది.

Updated : 20 Apr 2023 09:20 IST

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంచలనం కలిగించిన డాక్టర్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌కు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం, వరంగల్‌ జిల్లా రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వై.సత్యేంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రూ.10 వేల సొంత పూచీకత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరి నుంచి పూచీకత్తును కోర్టుకు సమర్చించాలని బెయిల్‌ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య 16 వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని సూచించారు. మృతురాలి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు