TSRTC: బస్సులతో ఆటలాడితే ఉపేక్షించం: ఎండీ సజ్జనార్‌

ద్విచక్రవాహనంపై వెళుతూ టీఎస్‌ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 03 May 2023 09:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: ద్విచక్రవాహనంపై వెళుతూ టీఎస్‌ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కాలుతో నెడుతున్నట్లుగా ఓ యువకుడు తీసుకున్న వీడియో ఘటనపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం రహదారులపై ఇలాంటివి చేేయవద్దని హెచ్చరించారు. మిధానీ డిపోనకు చెందిన బస్సు 104-ఎ రూట్లో వెళుతుండగా ఓ యువకుడు ద్విచక్రవాహనం నడుపుతూ ఒక కాలుతో బస్సు వెనుకభాగాన్ని నెడుతున్నట్లున్న వీడియో వైరల్‌ అయింది. ఈ వీడియోను సజ్జనార్‌ ట్వీట్‌ చేస్తూ.. ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చవద్దని సూచించారు. ఇలాంటి వారిపై చట్టప్రకారం సంస్థ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని