హైకోర్టు సూచనల మేరకే ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ

హైకోర్టు సూచనల మేరకు ఖమ్మంలోని లకారం ట్యాంకుబండ్‌పై ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నిర్వాహకులు దొడ్డా రవి, కర్నాటి కృష్ణ, శిల్పి ప్రతాప్‌వర్మ తెలిపారు.

Published : 20 May 2023 03:56 IST

ఖమ్మం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: హైకోర్టు సూచనల మేరకు ఖమ్మంలోని లకారం ట్యాంకుబండ్‌పై ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని నిర్వాహకులు దొడ్డా రవి, కర్నాటి కృష్ణ, శిల్పి ప్రతాప్‌వర్మ తెలిపారు. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్‌ విగ్రహం ఉండటం వల్ల అభ్యంతరాలు వ్యక్తమైన తరుణంలో స్వల్ప మార్పులు చేస్తున్నామని తెలిపారు. పిల్లనగ్రోవి, కీరిటంలోని చక్రాన్ని, నెమలి పింఛాన్ని తొలగించామన్నారు. రాజు రూపంలో ఉండే విగ్రహంగా మారుస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విగ్రహం ఏర్పాటును రాజకీయం చేయడం తగదన్నారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కేవలం ఆర్థిక సాయమందించారని పేర్కొన్నారు. అన్ని సామాజికవర్గాల వారూ చేయూతనందించారని తెలిపారు. దాతలను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, పసుమర్తి రామ్మోహన్‌, బత్తినేని నాగప్రసాద్‌, నాయకులు జశ్వంత్‌, నాగేశ్వరరావు, సైదుబాబు పాల్గొన్నారు. ఇదే అంశంపై తానా మాజీ అధ్యక్షుడు జై తాళ్లూరి స్పందించారు. విగ్రహ ఏర్పాటులో రాజకీయ ఉద్దేశం లేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు