Weather Update: రానున్న మూడు రోజులూ మండుటెండలు

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండలు మండనున్నాయి.

Updated : 27 May 2023 07:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండలు మండనున్నాయి. శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ సూచించింది. దేశంలోని వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతోపాటు పొడి వాతావరణం నెలకొనడమే దీనికి కారణం. గరిష్ఠంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. మరోవైపు జూన్‌ ఒకటో తేదీ నుంచి అయిదు రోజులపాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను కూడా తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.  శుక్రవారం నల్గొండ జిల్లా దామరచర్లలో గరిష్ఠంగా 44.3 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. మరోవైపు కరీంనగర్‌లోని భరత్‌నగర్‌ ప్రాంతంలో కానిస్టేబుల్‌ తంగేల్ల మధుకుమార్‌(41), ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం తులిస్యాతండాలో ఉపాధి కూలీ వాంకుడోతు సునీత(40) వడదెబ్బతో మృతి చెందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని