పీఎం స్వనిధి ఉత్సవాలకు వరంగల్ చాయ్‌వాలా.. సిరిసిల్ల పండ్ల వ్యాపారి
కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం ప్రారంభించి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలో జూన్ 1 నుంచి 3 వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది.
మట్టెవాడ, సిరిసిల్లగ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం ప్రారంభించి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలో జూన్ 1 నుంచి 3 వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులు, ఇద్దరు వీధి వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎంపికైన అధికారుల్లో మెప్మా కేంద్ర కార్యాలయానికి చెందిన కృష్ణచైతన్య, శివకుమార్. ఎంపికైన ఇద్దరు వీధి వ్యాపారుల్లో ఒకరు వరంగల్ నగరానికి చెందిన మహ్మద్ మహబూబ్ పాషా కాగా, మరొకరు సిరిసిల్లకు చెందిన గడ్డం కృష్ణయ్య ఉన్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి గేటు వద్ద టీస్టాల్ నిర్వహిస్తున్న మహబూబ్ పాషా కొవిడ్-19 కారణంగా వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు. పీఎం స్వనిధి పథకంతో తొలి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20 వేలు, మూడో విడతలో రూ.50 వేల రుణం తీసుకుని వ్యాపారాన్ని లాభసాటిగా మార్చుకున్నారు. కార్పొరేషన్ అధికారుల సలహాలతో పీఎం స్వనిధిని సద్వినియోగం చేసుకున్నానని, దిల్లీ ఉత్సవాలకు పిలుపు రావడం సంతోషంగా ఉందని పాషా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asia cup: జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనాకు ఒడిశా బంపర్ ఆఫర్!
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్