విభిన్న భాషల, సంస్కృతుల వేదిక తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను శుక్రవారం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో నిర్వహించారు.

Published : 03 Jun 2023 05:26 IST

గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఈనాడు, అమరావతి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను శుక్రవారం విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్‌లో నిర్వహించారు. ఏక్‌ భారత్‌-శ్రేష్ఠ భారత్‌లో భాగంగా నిర్వహించిన వేడుకల్లో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విభిన్న భాషల, సంస్కృతుల వేదికగా తెలంగాణ భారతీయ మిశ్రమ సంస్కృతికి ఒక మంచి, ఉత్తమ ఉదాహరణగా నిలిచిందని గవర్నర్‌ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల రాష్ట్రాల సంస్కృతులపై పరస్పర అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడల చుట్టుపక్కల విద్యా సంస్థల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులతో గవర్నర్‌ మాట్లాడారు. విద్యార్థులు బతుకమ్మ ఆడారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని