Mulugu: బందాల అడవిలో వేలల్లో రాకాసి గూళ్లు!

ఆదిమానవుల సమాధులుగా భావించే రాకాసి గూళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి, కామారం గ్రామాల పరిధి అటవీ ప్రాంతంలోనూ గతంలో ఈ గూళ్లను గుర్తించారు.

Updated : 08 Sep 2023 07:14 IST

ఆదిమానవుల సమాధులుగా భావించే రాకాసి గూళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామెరవాయి, కామారం గ్రామాల పరిధి అటవీ ప్రాంతంలోనూ గతంలో ఈ గూళ్లను గుర్తించారు. అదే మండలంలోని బందాల, బొల్లెపల్లి సమీప అడవుల్లో పెద్ద సంఖ్యలో వీటిని తాజాగా గుర్తించినట్లు బందాల సర్పంచి ఊకె మోహన్‌రావు గురువారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఇక్కడ దాదాపు 2 వేల వరకు ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం వీటిని గుర్తించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. ‘‘అవి 2500-3000 ఏళ్ల నాటి ఆదిమానవుల సమాధులు. గోదావరి పరీవాహక ప్రాంతాలైన జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 22 గ్రామాల్లో ఇలాంటి సమాధులు ఉన్నాయి’’ అని చరిత్రకారుడు, టార్చ్‌ కార్యదర్శి అరవింద్‌ ఆర్య ‘ఈనాడు’కు తెలిపారు.

 ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి; న్యూస్‌టుడే, ములుగు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు