చేనేతకు ‘అంత’మాత్రమే..!

కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి మళ్లీ నిరాశే మిగిలింది. 2024-25కూ కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లనే కేటాయించింది. చేనేతలో దాదాపు పదికి పైగా పథకాలున్నప్పటికీ ఒక్క జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ)కు మాత్రమే ఈ నిధులను నిర్దేశించింది.

Updated : 02 Feb 2024 05:46 IST

కేంద్ర బడ్జెట్‌లో చేనేత రంగానికి మళ్లీ నిరాశే మిగిలింది. 2024-25కూ కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లనే కేటాయించింది. చేనేతలో దాదాపు పదికి పైగా పథకాలున్నప్పటికీ ఒక్క జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ)కు మాత్రమే ఈ నిధులను నిర్దేశించింది. చేనేత, జౌళి, హస్తకళలతో కూడిన మొత్తం బడ్జెట్‌ రూ.4,392.85 కోట్లు కాగా.. అందులో 4.5 శాతం మేరకు చేనేతకు నిర్దేశించారు. చేనేత రంగానికి గత మూడేళ్లుగా కేటాయింపులు సుమారు రూ.200 కోట్లుగానే ఉన్నాయి. ప్రస్తుత (2023-24) ఆర్థిక సంవత్సరానికీ బడ్జెట్‌ కేటాయింపులు రూ.200 కోట్లు కాగా.. సవరణ బడ్జెట్‌లో దానిని రూ.190 కోట్లకు కేంద్రం తగ్గించింది. వీటిలోనూ రూ.106 కోట్లను ఇంతవరకు గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు వెచ్చించింది. తెలంగాణకు ఇంతవరకు రూ.2.5కోట్ల మేరకే ఎన్‌హెచ్‌డీపీ అమలుకు నిధులు వచ్చాయి.

ఆ పథకాలు నామమాత్రమే..: కేంద్రంలో చేనేత కార్మికుల సమగ్ర సంక్షేమ పథకం, నూలు సబ్సిడీ, చేనేత సమూహ అభివృద్ధి పథకం, భారీ సమూహ పథకం, సేవాకేంద్రం, మ్యూజియం, సౌకర్యాల కేంద్రం ఇతర పథకాలకు వరుసగా మూడో ఏడాదీ నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌లో ఈ పథకాలున్నట్లు పేర్కొన్నప్పటికీ నిధుల కేటాయింపులు లేకపోవడంతో ఇవి నామమాత్రంగానే మిగిలిపోనున్నాయి. 1985 చేనేత ఉత్పత్తుల పరిరక్షణ పథకం అమల్లో ఉన్నట్లు ప్రకటించిన కేంద్రం దానికి నిధులు కేటాయించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు