ప్రజారోగ్యశాఖ ఈఎన్‌సీగా జియాఉద్దీన్‌

రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌)గా జియాఉద్దీన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్‌.శ్రీధర్‌ ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ జియాఉద్దీన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

Published : 06 May 2024 03:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజారోగ్యశాఖ ఈఎన్‌సీ (ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌)గా జియాఉద్దీన్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఆ స్థానంలోని ఆర్‌.శ్రీధర్‌ ఏప్రిల్‌ 30న పదవీ విరమణ పొందగా.. ఆ బాధ్యతను నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ జియాఉద్దీన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జూన్‌ 4 వరకు ఆయన రెండు బాధ్యతల్లో కొనసాగుతారని, అనంతరం ప్రజారోగ్యశాఖలో పూర్తిస్థాయి ఈఎన్‌సీగా పనిచేస్తారని జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఎన్నికల అనంతరం జీహెచ్‌ఎంసీలో ఏర్పడే ఖాళీని సీనియర్‌ అధికారి, ప్రస్తుత ముఖ్య ఇంజినీరు దేవానంద్‌ భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని