Jacinda Ardern: చిరకాల భాగస్వామిని పెళ్లాడిన న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని

న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌ తన భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్‌ను పెళ్లాడారు. రెండుసార్లు దేశానికి ప్రధానిగా పని చేశారు.

Published : 13 Jan 2024 16:05 IST

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌ (Jacinda Ardern) తన చిరకాల భాగస్వామి క్లార్క్ గేఫోర్డ్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరికి 2019 మేలోనే నిశ్చితార్థం అయ్యింది. 2022 మొదట్లో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ, కొవిడ్‌ నిబంధనల కారణంగా కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ‘జీవితం అంటే అలానే ఉంటుంది’ అంటూ అప్పట్లో ప్రధానిగా ఉన్న ఆమె పేర్కొన్నారు. ఎట్టకేలకు ఓ ప్రైవేటు వేడుకలో కొద్దిమంది అతిథుల సమక్షంలో ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్‌ హిప్‌కిన్స్‌, ఇతర నేతలూ హాజరైనట్లు స్థానిక వార్తాసంస్థలు తెలిపాయి. గేఫోర్డ్‌ టీవీ ప్రజెంటేటర్‌గా ఉన్నారు.

మాతృత్వానికి అడ్డు కాకూడదనే రాజకీయాలకు గుడ్‌బై.. జెసిండా

2017లో న్యూజిలాండ్‌ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టే నాటికి జెసిండా వయసు కేవలం 37. అప్పటికి ప్రపంచంలో పిన్న వయస్కురాలైన ప్రభుత్వాధినేతగా రికార్డు సృష్టించారు. 2018లో ప్రధానిగా ఉన్న సమయంలోనే బిడ్డకు జన్మనిచ్చారు. కొవిడ్‌ కాలంలో దేశాన్ని సమర్థంగా నడిపించారు. 2020లో జెసిండా రెండోసారి ప్రధాని అయ్యారు. కొన్ని నెలలపాటు అంతా సవ్యంగానే సాగినా.. క్రమంగా ప్రతికూల పవనాలు మొదలయ్యాయి. గతేడాది జనవరిలో అనూహ్యంగా రాజీనామా ప్రకటించారు. రాజకీయాల నుంచీ వైదొలిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు