Diabetes: సెనగపిండితో మధుమేహం దూరం
సెనగలు, కాయధాన్యాలు, బీన్స్ వంటివి ఆహారంలో భాగమైతే గుండెజబ్బుల ముప్పు తక్కువనే విషయం తెలిసిందే. వీటిలో పెద్ద మొత్తంలో పీచుపదార్థాలు ఉండటమే దీనికి కారణం.
లండన్: సెనగలు, కాయధాన్యాలు, బీన్స్ వంటివి ఆహారంలో భాగమైతే గుండెజబ్బుల ముప్పు తక్కువనే విషయం తెలిసిందే. వీటిలో పెద్ద మొత్తంలో పీచుపదార్థాలు ఉండటమే దీనికి కారణం. తాజా పరిశోధనల మేరకు గోధుమ పిండి స్థానంలో సెనగ పిండిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కడుపునిండిన భావన కలిగిస్తుందని, అలాగే ఇన్సులిన్, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని తేలింది. తద్వారా అధిక బరువు సమస్యతో పాటు, టైప్-2 మధుమేహం బారిన పడకుండా తప్పించుకోవచ్చని వెల్లడైంది. 30% కొమ్ముసెనగ పిండి కలిపిన గోధుమ పిండితో తయారు చేసిన బ్రెడ్ భుజిస్తే.. సాధారణ రొట్టె తిన్నప్పటితో పోలిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు 40% తగ్గినట్లు గుర్తించారు. దీనికి ఇందులో ఉండే పిండిపదార్థం అరుగుదల స్థాయిని నెమ్మదింపచేయడమే కారణమని పరిశోధకులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం
ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. -
గాజా శాంతిచర్చల్లో పురోగతి!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే విషయంలో గమనించదగ్గ పురోగతి కనిపించిందని ఈజిప్టు అధికార ప్రసారమాధ్యమాలు వెల్లడించాయి. -
నిజ్జర్ హత్యకేసు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో అరెస్టైన నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష
అధిక మోతాదులో ఇన్సులిన్‌ను ఇచ్చి 17 మంది మరణానికి కారణమైన ఓ నర్సుకు అమెరికాలోని ఓ కోర్టు 700 ఏళ్లకు పైగా శిక్షను శనివారం విధించింది. -
రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ పేరును రష్యా తమ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఆయన కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పనిచేసిన పెట్రో పొరొషెంకో పేరు కూడా అందులో కనిపించింది. -
రఫాపై దండయాత్ర జరిగితే రక్తపాతమే: డబ్ల్యూహెచ్‌వో
ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న రఫాపై ఇజ్రాయెల్ దాడి జరిపితే భారీ సంఖ్యలో పాలస్తీనా పౌరులు చనిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
హ్యూస్టన్‌ను ముంచెత్తిన వరదలు
ఎడతెరిపిలేని వానలతో టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇళ్లపైకప్పులపై చేరి సాయం కోసం నిరీక్షిస్తున్న 300 మందికి పైగా ప్రజల్ని బలగాలు రక్షించాల్సి వచ్చింది. -
‘పారిస్ లక్ష్యాని’కి ఆమడదూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు
పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల నిర్మూలనకు దేశాలు సమర్పించిన ప్రణాళికలు ఆశాజనకంగా లేవని తాజా అధ్యయనం పేర్కొంది. -
పాకిస్థాన్‌లో యోగా తరగతులు షురూ
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ ప్రాచీన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనమైన యోగా.. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోనూ ఇప్పుడు అధికారికంగా ప్రవేశించింది. -
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
కొన్ని ఎకరాల వైశాల్యంలో ఉన్న విల్లాను ఉచితంగా ఇచ్చేందుకు ఒక దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది..!