Imran Khan: అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిని సాయం కోరిన ఇమ్రాన్‌.. వైరల్‌గా మారిన ఆడియో క్లిప్‌

ప్రధాని పదవిని కోల్పోయిన నాటి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ తరచూ అమెరికా ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మారింది. కానీ, ఇప్పుడు తనను ప్రభుత్వం జైల్లో పెడుతుందేమోనన్న భయంతో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలినే ఇమ్రాన్‌ సాయం అడిగారు.

Updated : 22 May 2023 07:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని పదవిని కోల్పోయిన నాటి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ తరచూ అమెరికా ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా మారింది. కానీ, ఇప్పుడు తనను ప్రభుత్వం జైల్లో పెడుతుందేమోనన్న భయంతో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలినే ఇమ్రాన్‌ సాయం అడిగారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ ఒకటి వైరల్‌గా మారిందని పాక్‌లో జియోటీవీ కథనం ప్రసారం చేసింది. అమెరికాలో ప్రతినిధుల సభలో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాక్సినె మూర్‌ వాటర్స్‌తో ఇమ్రాన్‌ టెలిఫోన్‌లో చర్చించారు. పాకిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై అమెరికాలోని చట్టసభలో గళం విప్పాలని ఆమెను కోరారు. ఈ సందర్భంగా ఆయన పాక్‌లోని పరిస్థితిని ఆమెకు వివరించినట్లు ఈ క్లిప్‌లో ఉంది. దీంతోపాటు తనకు అనుకూలంగా ఓ ప్రకటన కూడా విడుదల చేయాలని మాక్సినె మూర్‌ను ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని