Hanging: ‘ఉరి తీసేముందు అతడు సిగరెట్‌ అడిగాడు..’

‘‘నేను ఉరి తీసిన వ్యక్తుల్లో మునీర్‌ను మరువలేను. చివరికోరిక ఏమిటని అతణ్ని అడిగితే.. ఓ సిగరెట్‌ ఇమ్మన్నాడు’’ అని షాజహాన్‌ భుయియాన్‌ (74) మీడియాకు తెలిపాడు. దోపిడీ, హత్య నేరారోపణలతో 1991లో బంగ్లాదేశ్‌ కోర్టు భుయియాన్‌కు 42 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Updated : 19 Jun 2023 07:17 IST

26 మందిని ఉరి తీసిన ఢాకా ‘తలారి’ భుయియాన్‌ వెల్లడి

ఢాకా: ‘‘నేను ఉరి తీసిన వ్యక్తుల్లో మునీర్‌ను మరువలేను. చివరికోరిక ఏమిటని అతణ్ని అడిగితే.. ఓ సిగరెట్‌ ఇమ్మన్నాడు’’ అని షాజహాన్‌ భుయియాన్‌ (74) మీడియాకు తెలిపాడు. దోపిడీ, హత్య నేరారోపణలతో 1991లో బంగ్లాదేశ్‌ కోర్టు భుయియాన్‌కు 42 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అధికారుల ఆదేశాల మేరకు జైలులో తలారి విధులు నిర్వహించిన ఈయన మొత్తం 26 మందిని ఉరి తీశాడు. అందులో బంగబంధు షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ హంతకులు కూడా ఉన్నారు. సత్ప్రవర్తన కారణంగా పదేళ్లు శిక్ష తగ్గిన భుయియాన్‌ ఆదివారం ఢాకా కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యాడు. ఈ సందర్భంగా తనను చుట్టుముట్టిన మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు ఓ చెల్లెలు, మేనల్లుడు ఉండేవారు. 30 ఏళ్లుగా వారితో మాట్లాడింది లేదు. సొంత ఇల్లు కూడా లేదు. జైలులో పరిచయమైన ఓ మిత్రుడి ఇంటికి వెళుతున్నా. ప్రభుత్వం నాకో ఉద్యోగం, ఆవాసం చూపించాలి’’ అని కోరుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు