Hajj Yatra: తీవ్రమైన వేడిని ఎదుర్కొన్న హజ్‌ యాత్రికులు

సౌదీ అరేబియాలో హజ్‌ యాత్ర చేస్తున్న లక్షల మంది యాత్రికులు బుధవారం తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు.

Updated : 29 Jun 2023 08:26 IST

మీనా: సౌదీ అరేబియాలో హజ్‌ యాత్ర చేస్తున్న లక్షల మంది యాత్రికులు బుధవారం తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు. ఉదయం నమోదైన 42 డిగ్రీల ఉష్ణోగ్రత వద్దే పెద్ద ఎత్తున సమూహాలు కాలినడకన, బస్సుల ద్వారా మక్కా నగరం ఆవల గల జమారత్‌ కాంప్లెక్స్‌కు చేరుకున్నాయి. తాము ముందురోజు రాత్రే ముజ్‌దాలిఫాగా పేర్కొనే శిబిరం వద్ద సేకరించి పెట్టుకున్న రాళ్లను యాత్రికులు అక్కడి సైతాన్‌ స్తంభాలపైకి విసిరారు.  తీవ్రమైన వేడి వాతావరణం నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం, వారికి నీటిని అందించేందుకు సౌదీ అధికార యంత్రాంగం వేలమంది ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లను నియమించింది. ఈ క్రమంలో వడదెబ్బకు గురైన 287 మందికి వైద్య సేవలు అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని