సిడ్నీ మాల్‌ కత్తి దాడి.. నిందితుడికి మానసిక సమస్యలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కలకలం సృష్టించిన కత్తి దాడిలో నిందితుడి వివరాలను పోలీసులు కనుగొన్నారు.

Updated : 15 Apr 2024 06:04 IST

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో కలకలం సృష్టించిన కత్తి దాడిలో నిందితుడి వివరాలను పోలీసులు కనుగొన్నారు. అతడిని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన జోయెల్‌ కౌచీ(40)గా గుర్తించారు. గుర్తు తెలియని మానసిక సమస్యల వల్లే నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడని.. ఘటన వెనుక ఎటువంటి ఉగ్రహస్తం లేదని తమ ప్రాథమిక దర్యాప్తులో తెలినట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. నగరంలోని వెస్ట్‌ఫీల్డ్‌ షాపింగ్‌ మాల్‌లో శనివారం మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేసి ఆరుగురిని హతమార్చిన విషయం తెలిసిందే. మరో 12మంది క్షతగాత్రులయ్యారు. ఓ మహిళా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జరిపిన కాల్పుల్లో నిందితుడు మృతిచెందాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని