Xi Jinping: జిన్‌పింగ్‌ ఓ నియంత.. జర్మనీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నియంతగా జర్మనీ విదేశాంగ మంత్రి అభివర్ణించడంపై బీజింగ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 

Published : 21 Sep 2023 15:27 IST

బెర్లిన్‌: చైనా-జర్మనీ మధ్య మరోసారి విబేధాలు తలెత్తాయి. జర్మనీ (Germany) విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ (Annalena Baerbock) చైనా (China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను నియంతగా అభివర్ణించడంతో వివాదం తలెత్తింది. గత వారం అమెరికాలో పర్యటించిన జర్మనీ విదేశాంగ మంత్రి.. మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జిన్‌పింగ్‌ను నియంతగా అభివర్ణించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై స్పందిస్తూ.. ‘‘ఈ యుద్ధంలో పుతిన్‌ విజయం సాధిస్తే.. ఇతర నియంతలకు ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కు’’ అని అన్నాలెనా వ్యాఖ్యానించారు. 

జీ20 సదస్సు సందర్భంగా ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను తిరస్కరించిన ట్రూడో..!

ఈ వ్యాఖ్యలపై చైనా మండిపడింది. జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా చైనాలోని జర్మనీ రాయబారి పాట్రిసియా ఫ్లోర్‌కు సమన్లు జారీ చేసింది. అన్నాలెనా వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు, వాటితో పూర్తిగా విబేధిస్తున్నట్లు తెలిపింది. అయితే, ప్రపంచ దేశాలకు చెందిన నాయకులు జిన్‌పింగ్‌ను నియంతగా అభివర్ణించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం జిన్‌పింగ్‌ను నియంత అని పిలిచారు. అప్పట్లో బైడెన్‌ వ్యాఖ్యలను చైనా తప్పుబట్టింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడింది. చైనా ప్రయోగించిన నిఘా బెలూన్‌ను అమెరికా పేల్చివేయడంపై స్పందిస్తూ బైడెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని