Nepal: రష్యా సైన్యంలో చేరిన 100 మంది నేపాలీలు మిస్సింగ్‌!

రష్యా సైన్యంలో చేరిన తమ దేశానికి చెందిన 100 మంది యువకుల ఆచూకీ లభించట్లేదని నేపాల్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌పీ సౌద్‌ తెలిపారు. 

Published : 27 Dec 2023 00:31 IST

ఖాట్మాండూ: రష్యా సైన్యం (Russia Army) లో చేరిన నేపాల్‌ (Nepal)కి చెందిన 100 మంది యువకుల ఆచూకీ తెలియట్లేదని నేపాల్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌పీ సౌద్‌ (NP Saud) తాజాగా వెల్లడించారు. వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించే విపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలు నుంచి అదృశ్యమైనట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఎట్టకేలకు నావల్నీ ఆచూకీ లభించిన నేపథ్యంలో నేపాల్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 

‘‘దాదాపు 200 మంది నేపాలీ యువకులు ఎంప్లాయిమెంట్‌, స్టడీ, విజిట్‌ వీసాలపై రష్యాకు వెళ్లారు. అందులో చాలా మంది అక్కడే రష్యా సైన్యంలో చేరారు. ఎంతమంది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, మొత్తంగా రష్యా సైన్యంలో చేరిన 100 మంది నేపాలీల ఆచూకీ లభించట్లేదు. ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డట్టు సమాచారముంది’’అని నేపాల్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎన్‌పీ సౌద్ తెలిపారు. ఈ విషయంపై నేపాల్‌లోని రష్యన్‌ దౌత్యవేత్తను పిలిపించి చర్చించినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌లో నలుగురు నేపాలీలు యుద్ధ ఖైదీలుగా ఉన్నారని, వారిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని