అతిగా క్రియాశీలమైన ఇన్‌ఫ్లమేటరీ స్పందనతోనే లాంగ్‌ కొవిడ్‌

మితిమీరి క్రియాశీలమైన ఇన్‌ఫ్లమేటరీ స్పందన వల్లే అనేక మందిలో దీర్ఘకాల కొవిడ్‌ తలెత్తుతున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని ఫ్రెడ్‌హచీసన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

Published : 13 Jun 2023 23:46 IST

దిల్లీ: మితిమీరి క్రియాశీలమైన ఇన్‌ఫ్లమేటరీ స్పందన వల్లే అనేక మందిలో దీర్ఘకాల కొవిడ్‌ తలెత్తుతున్నట్లు వెల్లడైంది. అమెరికాలోని ఫ్రెడ్‌హచీసన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. దీర్ఘకాల కొవిడ్‌ (లాంగ్‌ కొవిడ్‌)తో బాధపడుతున్న కొందరిలో ఇన్‌ఫ్లమేషన్‌తో ముడిపడ్డ ఒక జత పరమాణువులు రక్తంలోని ప్రొటీన్లలో కనిపించాయి. వ్యాధి నుంచి కోలుకున్నవారిలో ఇవి లేవని శాస్త్రవేత్తలు తెలిపారు. లాంగ్‌ కొవిడ్‌ ఉన్న 55 మంది రోగులను పరిశీలించినప్పుడు మూడింట రెండొంతుల మందిలో ఇన్‌ఫ్లమేషన్‌కు సంబంధించిన కొన్ని సంకేతాలు ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 25 మందిని, గతంలో ఎన్నడూ ఈ వ్యాధి బారినపడని మరో పాతిక మందిని పరిశీలించారు. లాంగ్‌ కొవిడ్‌ లేనివారి రక్తంలో ఇలాంటి ఇన్‌ఫ్లమేషన్‌ సంకేతాలు లేవని గుర్తించారు. దీన్నిబట్టి కొన్నిరకాల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులతో కొందరు బాధితులకు ఉపశమనం కలగొచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఎలాంటి బాధితులకు ఏ తరహా చికిత్స అవసరమన్నది వైద్యులు నిర్ధారించాల్సి ఉంటుందని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని