Kim Jong Un: సుఖోయ్‌-35 ప్లాంట్‌కు కిమ్‌..!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉత్తరకొరియాలో పర్యటించేందుకు అంగీకరించారు. అంతేకాదు.. ప్యాంగ్యాంగ్‌ ఉపగ్రహ, అంతరిక్ష కార్యక్రమానికి సాయం చేస్తామన్నారు. మరో వైపు రష్యా పర్యటనలో ఉన్న కిమ్‌  సుఖోయ్‌-35 యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు.

Published : 15 Sep 2023 12:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా (Russia) పర్యటనలో భాగంగా సుఖోయ్‌-35 యుద్ధ విమానాలను తయారు చేసే ఫ్యాక్టరీని ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) సందర్శించారు. కొమ్సోమోల్క్స్‌ ఆన్‌ అముర్‌ నగరంలోని విమాన తయారీ ప్లాంట్‌ రష్యాలోకెల్లా అతిపెద్దది. ఇక్కడ సుఖోయ్‌-35తోపాటు పలు రకాల యుద్ధ విమానాలను తయారు చేస్తారని రష్యా న్యూస్‌ ఏజెన్సీ టాస్‌ పేర్కొంది. ఇరు దేశాలు సైనిక సహకారంపై ఒప్పందం చేసుకునేందుకు ఈ పర్యటన జరుగుతోంది. కిమ్‌ తన పర్యటనలో భాగంగా రష్యా తూర్పు నగరమైన వ్లాదివాస్తోక్‌ను కూడా సందర్శించనున్నారు. అక్కడ రష్యా పసిఫిక్‌ దళం శక్తి సామర్థ్యాలను స్వయంగా పరిశీలించనున్నారు.

మరోవైపు ఉత్తర కొరియాలో పర్యటించాలన్న ఆహ్వానాన్ని పుతిన్‌  (Putin) అంగీకరించారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ వెల్లడించారు. అక్టోబర్‌లో రష్యా రక్షణ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ కూడా ప్యాంగ్యాంగ్‌ను సందర్శించనున్నారు. అంతేకాదు.. ఉత్తరకొరియా ఉపగ్రహ, అంతరిక్ష కార్యక్రమాలను అభివృద్ధి చేసేందుకు రష్యా తరపున సాయం చేయడానికి పుతిన్‌ సానుకూలత వ్యక్తం చేశారు.

మెక్సికో పార్లమెంటులో గ్రహాంతరవాసులు!

బుధవారం కిమ్‌కు పుతిన్‌ విందు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉ.కొరియా నియంతకు పుతిన్‌ ఓ స్పేస్‌ సూట్‌గ్లౌ బహుమతిగా ఇచ్చారు. రష్యాలో అభివృద్ధి చేసిన కార్బన్‌తో దీనిని తయారు చేశారు. ఈ విందు ప్రారంభం సమయంలో కిమ్‌ మాట్లాడుతూ ‘‘రష్యా సేనలు దుష్టశక్తులతో చేస్తున్న యుద్ధంలో విజయం సాధిస్తాయి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని