Maldives row: బాయ్‌కాట్ ట్రెండ్ వేళ.. చైనా పర్యటనలో మాల్దీవుల అధ్యక్షుడు

మాల్దీవుల(Maldives) నూతన అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు( Mohamed Muizzu) ఐదురోజుల పర్యటనలో భాగంగా చైనా(China) వెళ్లారు.  

Updated : 11 Jan 2024 14:04 IST

మాలే: ప్రధాని మోదీ(Modi) ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించడంపై మాల్దీవుల(Maldives) నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు మొహ్మద్ మయిజ్జు( Mohamed Muizzu) చైనా(China) పర్యటనకు వెళ్లారు. తన సతీమణితో కలిసి ఆదివారం రాత్రి పయనమయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(Xi Jinping) ఆహ్వానం మేరకే ఈ ఐదురోజుల అధికారిక పర్యటన జరుగుతోంది.

భారత్‌తో దౌత్యపరమైన వివాదం నెలకొన్న తరుణంలో ఈ పర్యటన జరుగుతుండటం గమనార్హం. మయిజ్జు కొద్దినెలల క్రితమే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా డ్రాగన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఇరుదేశాల అధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపి, పలు రంగాల్లో సహకారం కోసం సంతకాలు చేయనున్నారు.  ద్వీపదేశంలో సందర్శకుల సంఖ్యను పెంచడం ఈ పర్యటన లక్ష్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

‘లక్షద్వీప్‌తో మాల్దీవులకు సమస్య ఏంటీ: ఎంపీ’

మాల్దీవుల(Maldives) మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఆ మంత్రుల్ని సస్పెండ్ చేసింది. ఇక్కడితో శాంతించని నెటిజన్లు.. బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదాన్ని త్వరితగతిన ముగించేలా చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని