Modi: యూఏఈ పర్యటనలో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ(PM Modi) యూఏఈ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ ఆలయాన్ని ప్రారంభించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

Updated : 13 Feb 2024 19:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ(Modi) మంగళవారం యూఏఈ(UAE)కి చేరుకున్నారు. గౌరవవందనంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. 2015 నుంచి ఇప్పటివరకు మోదీ ఏడుసార్లు యూఏఈలో పర్యటించారు. ఇదే విషయాన్ని ఆయన తన ఎక్స్‌(ట్విటర్) ఖాతాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

భారత్‌-యూఏఈ స్నేహబంధానికి ఇచ్చే ప్రాధాన్యతను ఈ పర్యటనలు వెల్లడిస్తున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ‘మా సోదరుడు అధ్యక్షుడు మహ్మద్‌ బిన్‌ జాయేద్‌తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నాను. అక్కడ తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ఘనత నాకు దక్కనుంది. అబుదాబిలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడనున్నాను’ అని భారత్‌ నుంచి బయల్దేరేముందు మోదీ పోస్టు పెట్టారు.

అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?

తమ దేశానికి వచ్చిన మోదీని యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఆత్మీయంగా స్వాగతించారు. అబుదాబిలో వారిద్దరు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరువురు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం ‘అహ్లాన్‌ మోదీ’ పేరిట ప్రవాస భారతీయులతో మోదీ మాట్లాడనున్నారు. ఫిబ్రవరి 14న వరల్డ్‌ గవర్నమెంట్‌ సమ్మిట్‌లో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే రోజు బాప్స్‌ స్వామినారాయణ్‌ (BAPS Swaminarayan) సంస్థ నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఖతార్‌ దేశానికి వెళ్లనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని