Thammineni Seetharam: స్పీకర్‌ తమ్మినేనికి ‘గడప గడప’లో చుక్కెదురు..

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్​ తమ్మినేని సీతారామ్‌ (Thammineni Seetharam)కు సమస్యలు స్వాగతం పలికాయి. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం లక్కుపురంలో సర్పంచ్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో తమ్మినేని పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వం (YSRCP Govt) ఏర్పడి నాలుగేళ్లు అవుతోందని.. తమ గ్రామంలో ఇంతవరకు కనీస మౌలిక వసతులు లేవని తమినేనిని గ్రామస్థులు ప్రశ్నించారు. ఊరిలో వీధి దీపాలు వెలగటం లేదని, తాగునీరూ అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన సభాపతి.. 30 - 45 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని లేదంటే గ్రామంలోనే అడుగుపెట్టనని స్పష్టం చేశారు.

Published : 16 Apr 2023 15:23 IST

Tags :

మరిన్ని