Krishna: కృష్ణ.. నిర్మాతల పాలిట కల్పవృక్షం: బాలకృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ట భౌతిక కాయానికి ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ దంపతులు నివాళులు అర్పించారు. ‘‘డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో కృష్ణ మన మధ్య లేరన్నది నమ్మలేని నిజం. ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశారు. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారు. పద్మాలయ స్టూడియోస్‌ స్థాపించి గొప్ప సినిమాలు తీశారు. నిర్మాతల పాలిట కల్పవృక్షం. కొత్త దర్శకులు, నిర్మాతలను ఎన్టీఆర్‌, కృష్ణలే పరిచయం చేశారు. కృష్ణగారితో కలిసి ‘సుల్తాన్’లో నటించా. షూటింగ్‌ కోసం అండమాన్‌ వెళ్తే, నాన్నగారి గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఎన్టీఆర్‌, కృష్ణలు చిత్ర పరిశ్రమకు స్ఫూర్తి ప్రదాతలు’’ అని బాలకృష్ణ అన్నారు. 

Published : 16 Nov 2022 11:44 IST

Tags :

మరిన్ని