Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు మోహన్ బాబు, దగ్గుబాటి అభిరామ్, సంఘవి

తిరుమల (Tirumala) శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంచు మోహన్ బాబు (Mohan Babu), దగ్గుబాటి అభిరామ్ (Abhiram Daggubati), నటి సంఘవి (Sanghavi) స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మోహన్ బాబు, దగ్గుబాటి అభిరామ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో రూ.100 కోట్ల బడ్జెట్‌తో భారీ చిత్రం నిర్మించబోతున్నట్లు మోహన్ బాబు తెలిపారు.

Published : 01 Jun 2023 12:39 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు