CM Jagan: ఈవెంట్ల మాదిరి జగన్‌ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర

జగన్‌ కాన్వాయ్‌ ఝుమ్మంటూ వెళ్తుంటే.. తెల్ల చొక్కాలు వేసుకుని నలుగురు యువకులు రోడ్డు పక్కన మోకాళ్లపై నిలబడి, రెండు చేతులు పైకెత్తి.. నువ్వే మా దేవుడివి అన్నట్టుగా మొక్కుతుంటారు.

Published : 19 Apr 2024 13:23 IST

ఎర్రటి ఎండలో  చెప్పుల్లేకుండా వచ్చేదొకరు! ఝమ్మున వెళ్తున్న బస్సు వెంట పరిగెత్తేదొకరు! అదే బస్సు ఎదుట మోకాళ్లపై సాగిలపడి మొక్కేదొకరు. జగన్ మామయ్యా అంటూ అరిచేదొకరు. ఇలా బస్సు యాత్రలో ఎన్నో సీన్లు రక్తికట్టిస్తున్నాయి. కొన్ని పాత్రలు అలా వచ్చి, ఇలా ఎందుకు వెళ్తున్నాయో ఆ జగన్నాటకధారికి తప్ప ఎవరికీ అర్థంకాదు. ఎందుకంటే అక్కడ సీన్ టూ సీన్ ఐప్యాక్ డైరెక్షన్, జగనన్న యాక్షన్. ఎన్నికల వేళ ఈ జగన్నాటకం ఆస్కార్‌కు డైరెక్ట్‌గా నామినేట్ అవుతుందేమో అంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు.

Tags :

మరిన్ని