Lok Sabha Polls: 360 మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు: ఏడీఆర్‌

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో పోటీ పడుతున్న 1710 మంది అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) పేర్కొంది.

Published : 05 May 2024 09:57 IST

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో పోటీ పడుతున్న 1710 మంది అభ్యర్థుల్లో 21 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) పేర్కొంది. 24 మంది అభ్యర్థులకు ఆస్తులే లేవని తెలిపింది. నాలుగో విడతలో మెుత్తం 1717 మంది పోటీ పడుతుండగా 1710 మంది అఫిడవిట్లను ఏడీఆర్‌ విశ్లేషించి ఓ నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ అత్యధికంగా రూ.5 వేల కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపరిచారని ఏడీఆర్‌ వెల్లడించింది.

Tags :

మరిన్ని